సన్న జాజుల మాలలు….
మరుమల్లె పువ్వుల దండలు…
తెచ్చాము కానుకగా సుందరేశా….
భక్తితో వేశాము కానరా పార్వతీశా…
ఆగ్రాణించుము శివా…నిరంతరము…
అనుగ్రహించుము శివా…మమ్ము సత్వరము….!!సన్న!!
కరిగించుకొన మదిలోని మలినములనన్నీ…
వదిలించుకొన గత జన్మ పాపములనన్నీ…..
ఒప్పుకొన నీ ముందు తప్పులనన్నీ…
చెప్పుకొన క్షమాపణలు లెక్కలేనన్నీ….
వినిపించ వచ్చాను శిరమొంచి గుడికి….
విని రావయ్యా శంకరా…నా మనసులోకి…!!సన్న!!
నీవు చేరదీస్తే ఇంకొక నందినౌతా…
నీవు కృప చూపితే కర్పూర హారతౌతా….
నీవు ఆనతిస్తే సేవకుడిగా వుండిపోతా….
నీవు అనుమతిస్తే నీ సేవలో పండిపోతా….
నీవు ఆశీనుడవైతే పానవట్టమవుతా…
నీవు వరమునిస్తే నీలోన ఐక్యమవుతా….!!సన్న!!
పాహిమాం….పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం….