బిల్వ దళముల మాలలో…

బిల్వ దళముల మాలలో…
పలు పట్టువలువల సొబగులో…
కరుణ చూపే రీతిలో…
కనికరించే తీరులో….
కంటిరా ముక్కంటి నిన్ను భస్మ హారతి వేళలో….
శరణంటిరా…. చక్కంటి నిన్ను ప్రభాత సంధ్యల పూజలో…!! బి!!

ఎంత ముదమో ఆ బిల్వమంటే
అంతగా నన్నిష్ట పడుమా…
ఎంతెంత ముదమో రుద్రమంటే…
పలికించు నాతో జంగమా…
కలవరముగ వుంది తండ్రి కనిపించవా నా స్వప్నమందు…
కల కాదు నిజమని తెలుపు తండ్రీ
నీ మహిమ జగమున చాటుకుందు…!! బి!!

భస్మ లేపన ప్రక్రియ
నిర్వర్తిస్తునయ్యా శంకరా..
పలుకుతూ నమః శివాయా
నీ గీతములు రచయింతురా…
చిటికెడంత భస్మమిస్తే దిద్దుకుంటా నుదుటిపై….
నమఃశివాయాని అని తలచుకుంటూ లక్షల కవితలుంచెద కాళ్లపై….!!బి!!

పాహిమాం…శివ పాహిమాం..శివ పాహిమాం…శివ పాహిమాం..
హర రక్ష మాం…శివ రక్ష మాం..హర  రక్ష మాం…శివ రక్ష మాం…

Leave a Comment

Scroll to Top