నందివాహనాధీశ నాగేశ్వరా…
త్రిశూల హస్తాయ శివా గంగాధరా…
ఆత్మానందము కలుగు నిను గాంచిన….
పరమానందము కలుగు ధ్యానించినా…
పాహి పరమేశా…మనసు నీ వైపు నిలుపు…
మాం పాహి జగదీశా…చూసి నా తడి కనులవైపు….!!నంది!!
లేదయ్య నాకు దేనిపై ఆశ….
పెట్టనీవా నన్ను నీ పైన ధ్యాస…
నీదే కదా శివా నా మొదటి శ్వాస…
నీ సేవలో విడవాలి నా చివరి శ్వాస…
అంతరంగమున నుండి పొంగిన ఆవేదనే ఇది….
నివేదనలు నిక్షిప్తమై ఉన్న మౌన గానమే ఇది…!!నంది!!
వీక్షించవా ఒకసారి హృదయ ఫలకం…
వ్రాసుంది నీ మూల మంత్రాక్షరం…
చెవినుంచవా ఒకసారి ఓ దీనబంధూ…
నీకు వినిపించు నీ స్మరణ ఎల్లవేళలందు….
అనుసంధానమై ఉంది నీతోటి నా మానసం…
అనిర్వచనీయమైన బంధాన్ని తానొంది ధ్యానిస్తూ ప్రతి క్షణం…!!నంది!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్షమాం..సర్వేశ్వర రక్షమాం…