అడగకే మనసా శివుని వరమిమ్మని…
హరుడు కనుచూపునిచ్ఛాడు నను కనమని…
అది అదియే నీకు బహు గొప్ప వరము…
వేరేది ఎందుకిక నీ జన్మ సఫలము…
శిరమొంచి మొక్కు శివుని పాదాలను ..
ఇంత భాగ్యము నిచ్చిన హరుని చరణాలను..!! అడ!!
కానవే ఏలోటు తన కరుణ లోన..
తీరదే తన ఋణము ఎన్నాళ్ళకైనా…
చూపునే తన దయను ఎన్ని సార్లైనా…
ఇచ్చునే వరములను ఎన్ని వేలైన…
కరుణ రస హృదయుడు కామాక్షి విభుడు…
కష్టాలు కలవంటే తాను ముందుండు…!! అడగ!!
అడగకనె చొరబడును నీ మనసు లో…
శివుడు చెప్పకనే నిన్నుంచు తన పరిధిలో….
వేసేవు ప్రతి అడుగు తన దారిలో…
నీకు కనిపించు తన మహిమ ప్రతి మలుపులో…
కనుక స్మరియించు ప్రతి క్షణము తన నామము..
తుదకు చేరేవు తిన్నగా కైలాసము…!!అడగ!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్షమాం..సర్వేశ్వరా రక్ష మాం…