మానవా…చేయరా శివుని పూజలు…
భక్తితో చేయరా విస్తృతముగా తన సేవలు…
ఉంచుకోడు శివుడు నీ కష్టము…
ప్రేమతో దీవించి నెరవేర్చు నీ ఇష్టము…
రాల్చేవు ఆనంద భాష్పజలములను…
నీకు నీవే మొక్కేవు హరుని చరణాలను…!!మా!!
వేస్తుంటిమని మనము చెడు అడుగులు….
శివుడు వేయించు మన చేత గుడి వైపు అడుగులు…
చేస్తుంటిమని మనము పలు తప్పులు…
హరుడు కట్టించు మన చేత తన ముడుపులు….
అహర్నిశలు మన కొరకు శ్రమియించు శివుడు….
రేపవళ్ళూ మన గురించి యోచించు హరుడు…!!మా!!
శివుడు కనిపించడేమని దిగులు చెందొద్దు…
నన్ను కరుణించవేమని ప్రశ్నించవద్దు.. .
కర్మానుసారముగా కరుణించు నతడు….
గత జన్మ పుణ్యానుసారముగా దీవించునతడు….
తక్షణము చేయి నీ మనసు కైంకర్యం….
నిన్ను కరుణించుటే అవును శివుని కర్తవ్యం…!!మా!!
పాహిమాం.. పాహిమాం పరమేశ్వర పాహిమాం…రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…