మూడు కనుల జంగమా తరలి రావా…

మూడు కనుల జంగమా తరలి రావా…
ఉత్తరాయణ పుణ్య తిథిన వరములు ఇయ్యరావా…
కాళహస్తీ లింగమా కదలిరావా…
మా సంక్రాంతి సంబరమును కానరావా…
ఆనందముల హోరు మిన్నంటుతుంటే….
పులకించినది జగము నీవు కరుణించుచుంటే…!! మూడు!!

రంగవల్లులతో ఊరు కాంతులిడుతుంటే…
గొబ్బి పాటలతో యువత చిందులేస్తుంటే…
ధాన్య రాశులు ఇంట గుట్టలవుతుంటే…
పాడి పశువుల తో పల్లె అలరారుతుంటే…
చెప్పతరమా అనుభూతి శివశంకర…
అది నీ ప్రసాదమే కదా పరమేశ్వరా…!!మూడు!!

నీ సృష్టిలో మాకు లోటనుట తెలియునా…
నీ కరుణలో బేధ భావాలు ఉండునా…
నీ దృష్టి పడకున్న లోకాలు మిగులునా…
నీ ప్రేమ కరువైన మా ప్రాణాలు నిలువునా…
పరమాద్భుతం నీ సృష్టి పరమేశ్వరా….
నీ సృష్టిలో మేముంటిమి ధన్యోస్మి శంకరా…!!మూడు!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top