అదిగో కనరా శంకరుని…

అదిగో కనరా శంకరుని…
దీవించగ వచ్చిన భవహరుని…
వడిగా తెమ్ముర పువ్వులని…
వడివడిగా చేయగా పూజలని…
తగుదిక జాగు వరమొంద…
తగు సమయము నీకిది దయ పొంద…!!అదిగో!!

కొలిచే మనసుల కొరకై…
భక్తిని కనపరచే వారల కొరకై….
పిలిచే పిలుపుల కొరకై…
ఆర్తిని తెలిపే దీనుల కొరకై…
తహతహలాడును శంకరుడు…
తపియించును  ప్రేమతో మన హరుడు…!!అదిగో!!

నమ్మిన భక్తుల కొరకై…
తన సేవలు చేసిన వారలకై…
దిక్కను వారల కొరకై…
చరణాలే శరణను వారలకై…
ఆరాటము చెందును ఈశ్వరుడు…
అందించును చేతిని శుభకరుడు…!!అదిగో!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమామ్ రక్షమాం సర్వేశ్వర రక్షమాం…

Leave a Comment

Scroll to Top