వందనమయ్యా గణ నాథా…వందనమయ్య వందనము…
అడిగెదమయ్యా గణనాథా వరమిమ్మని నిన్నూ అడిగెదము…
సిద్ధి వినాయక దయ కనరా…
వర సిద్ది వినాయక మొర వినరా…!!వ!!
మూషిక వాహనమెక్కేవు…
ముల్లోకములను చుట్టేవు…
వరములనిస్తూ వెళ్లేవు…
వరదాయకుడవై నీకు మెరిసేవు…
గణ గణ గణ గణ నాథా…
నా మనసే నీకు ఋణపడదా…!!వం!!
విఘ్నాలను తొలగిస్తావు…
శుభలగ్నాలుగా చేసేస్తావు…
అడ్డంకులను తరిమేస్తావు…
మా అండవు నీవై వుంటావు…
గణ గణ గణ గణ నాథా…
శివ పార్వతి తనయ కనరాదా…!!వం!!
పాహి పాహి గణనాథ.. మాం.పాహి పాహి గణనాథ…
రక్షా రక్షా గణనాథా శివ శంభో శంకర గణనాథ…