ఏనాటి వరమో ఇది…

ఏనాటి వరమో ఇది…
శంకరా.. ఏ పూర్వ పుణ్యమో ఇది…
కదలాడుతుంటావు నా కనులలో…
నీవు మెదలాడుతుంటావు నా మనసులో….
చేయలేదే  పూజ మనసారాగా…
నేను ఉంచలేదే ధ్యాస నిను కొలవగా…!!ఏ!!

 దయ చూపినావయ్య గిరిజాపతి…
కరుణించినావయ్య గౌరీపతి…
క్షణమైన నీ పైన ధ్యాసుంచని…
ఒక్క ఘడియైన మనసారా పూజించని…
ఈ జన్మకిచ్చావా అంతోటి వరము…
నేను ఏ జన్మలో పొందని ఈ పుణ్య ఫలము….!!ఏ!!

బ్రతుకు పోరాటాన నిను మరచితి…
రాగ బంధాల మధ్యనే  నేనలిగితి…
విడిపించు భవబంధ సంకెలలు వేగమే….
నాకు చూపించు నిను చేరు దారులను శీఘ్రమే….
నాలోని వేదనను వినిపించుకో…
శంకరా..నందిగా గుడి ముందు నన్నుంచుకో……!!ఏ!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర రక్షమామ్ రక్షమాం సర్వేశ్వర…

Leave a Comment

Scroll to Top