తెలుసుకుంటి తెలుసుకుంటి శంకరా….

తెలుసుకుంటి తెలుసుకుంటి శంకరా….
నేనొంటరినని తెలుసుకుంటి ఈశ్వరా…
వేడుకుంటి వేడుకుంటి హరహరా..
తోడుంటునని మాటిమ్మని భవహరా…
కానరాక దారి కరుణించమంటిరా…
నిన్ను చేరుదారి వైపు నడిపించమంటిరా…!!తె!!

తోడురారు ఎవ్వరూ ప్రేమెంత చూపినా…
ఎవరి వెంట రారు ఎవ్వరూ సిరులెన్ని ఇచ్చినా…
పుటక నుండి గిట్టుదాక నీవే కనురెప్పని…
మా ఆత్మలన్ని కలుపుకునే నీవే ఆత్మబంధువని…
తెలుసుకుంటి శంకరా ఈ సత్యమునిప్పుడు…
ఇక వీడనయ్య శంకరా నీ చరణాల నెప్పుడు…
!! తె!!

కాల మహిమ వలనో
 ఏ కర్మఫలము వలనో…
ధ్యాస పెట్టనైతి నేనెందుచేతనో..
మొహాల మాయ వలనో
ఏ ముసుగు కప్పబడెనో….
అర్పించనైతి మనసు నేనెందువలననో…
తప్పుకాచి మన్నించుము తాండవప్రియ…
నాపై కరుణా చూపి తోడుండుము పార్వతీ ప్రియా…!! తె!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…

Leave a Comment

Scroll to Top