తరలిరావ తరలిరావ తాండవప్రియా…
నీవు కదలి రావా కదలిరావా ఢమరుక ప్రియా….
చేతబట్టి త్రిశూలం…
తెరుచుకొని త్రినేత్రం…
దుర్గుణములను సంహరించు వృషభ వాహనా…
మాకు సద్గుణములను ప్రసాదించు నాగభూషణా…!!త!!
స్వార్థాలకు చిరునామా మా జన్మలాయెరా….
సకల మోసాలకు పాల్పడుతూ అవి దోషులాయెరా….
పూర్వజన్మ పాపమో…
ఏ జన్మ కర్మఫలమో…
మనసులన్ని మలినమాయే మల్లికార్జునా…
మమ్ము పెడదారిన నడిపించెను నంది వాహనా…!!త!!
చూడగలమా మేము నీ చేత త్రిశూలం…
చూసి బ్రతకగలమా మేము కోపాగ్ని త్రినేత్రం…
తప్పు చేసినామని…
నిన్ను మరచినామని…
ఆగ్రహించుకోకయ్యా ఆదిశంకర…
మాకు సద్గతులను ప్రసాదించు సోమశేఖర…!!త!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… ర క్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…