కార్తీక మాసం…

కార్తీక మాసం…
పుణ్యాల కోసం…
ప్రార్థించరే శంకరుని భక్తి మీరా…
ధ్యానించరే ఈశ్వరుని మనసు ద్వారా…
పూజించరే మన శివుని శక్తి మీరా…
తిలకించరే సాంబడిని తనివి తీరా…!!కా!!

చేయండి అభ్యంగ స్నానాలను…
నుదుట దిద్దండి విభూది నామాలను…
తేరండి బుట్టలతో కుసుమాలను…
అల్లండి ఈశునికి పూమాలను..
పలుకుతూ నమశ్శివాయ మంత్రాలను…
మీరు వేయండి శంభునికి విరి మాలను….!!కా!!

మురిసేను శంకరుడు మీ భక్తికి…
కరుణ చూపేను ఎనలేని మీ సేవకి..
వీడడిక మీ చేయి ఏనాటికి….
శివుడు వచ్చునట పిలిచితే తగు వేళకి…
చీకుచింతలు మనకు ఇక దేనికి…
హరుని  చరణాలు వాలంగ పదముందుకి…!!కా!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top