త్రినేత్ర నీలకంఠా…
త్రిశూల గరళ కంఠా…
ఎవరికీ కానవంట…
శరణనిన రక్షింతువంట….
నీ మహిమ తెలియదంట….
శంకరా…నీ కరుణ గొప్పదంట…!! త్రి!!
నిరాడంబరము నీకు ఇష్టమంట…
నాల్గు దిక్కులే నీకు వలువలంట…
సర్పమే నీకు నేస్తమంట…
గజ చర్మమే నీకు మక్కువంట…
గంగధారలు నీకు మోదమంట…
బిల్వ దళ పూజలు నీకు ముచ్చటంట…!!త్రి!!
మంచుకొండలు నీ నివాసమంట…
మా తల్లి మహేశ్వరీ నీకు సగభాగినంట…
గణపయ్య,షణ్ముఖులు ప్రాణమంట…
బ్రహ్మాది దేవతలు నిను కొలుతురంట…
భస్మ అభిషేకములు నీకు వేడుకంట…
భక్త శిఖామణులను నీవు వదలవంట…!!త్రి!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం..రక్ష మాం…రక్ష మాం..మహా కాళేశ్వరా…రక్ష మాం..