చెప్పకనే నా మనసు నిను తలచునయ్యా…
నాకు తెలియకనే నీ స్మరణ తను చేయునయ్యా…
ఎంత భాగ్యమ్ము నిచ్చావు శంకరయ్య…
ఈ జన్మకెంత యోగము నిచ్చావు ఈశ్వరయ్య…!! చె!!
శ్వాసించునపుడూ తాను శివ శివాయనును…
మగతలో ఉన్ననూ నమశ్శివాయ అని అనుచుండును..
కల లోన కైలాస గిరి చూడును…
ఆ గిరి నందు నిను చూసి తరియించును….
ఆనందభాష్పాలతో నిన్ను కీర్తించును…
సుగంధ పుష్పాలతో నిన్ను అర్చించును…!! చె!!
అలౌకికమైన ఆనందం కలుగు నీ స్మరణలో….
అనిర్వచనీయమైన అనుభూతి కలుగునీధ్యాసలో…..
ప్రశాంతముగా నిన్ను కొలిచి తొలిసంధ్యలో…
మనసు ప్రభావితము చెందినది నీ తలపులో….
ఈశ్వరా… అను ఆర్ద్రతల పిలుపులో…
చూసేవు నీ రూపు నా హృదయ గదిలో….!! చె!!
పాహిమాం పాహిమాం శివశంకర పాహిమాం… రక్షమాం రక్షమాం అభయంకరా రక్షమాం…