శివ శంకరీ తల్లి పరమేశ్వరీ…

శివ శంకరీ తల్లి పరమేశ్వరీ…
అభయంకరీ మాతా  భువనేశ్వరీ…
అఖిల జగములనేలు ఆదిపరాశక్తి…
మహాద్భుతమమ్మ తల్లి నీదు ఘన కీర్తి…!!శివ!!

కైలాస శిఖరమున నీవు విహరించు వేళ….
శంకరుడు ప్రేమతో నిను చేరు వేళ…
సెలవియ్యవమ్మా నీ విభునికి మా వెతలను…
కలసి పండించరమ్మా  తల్లి మా కలలను…
అమ్మ మాయమ్మ బంగారు బొమ్మ…
జంగముడు కాదనడు నీ మాట చెప్పి చూడమ్మా…!!శివ!!

మీరే మా తల్లి సర్వము సమస్తము…
మీ కరుణాకటాక్షములే మాకు జీవ ఔషధము…
ఏ క్షణము మీ నీడ పడకున్ననూ…
ఏ ఘడియ మీ ప్రేమ కరువైననూ..
జీవించలేమమ్మ శివ శివానీ…
క్షణము నివసించలేమమ్మా మృదుభాషిణి….!!శివ!!

పాహిమాం పాహిమాం పరమేశ్వరి పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వరీ రక్షమాం…

Leave a Comment

Scroll to Top