రాముడు చేసిన లింగమా…
తను పూజలు చేసిన జంగమా…
భరతావని జ్యోతిర్లింగమా…
ఈ అవనిని చల్లగ కావుమా…
శివ శివ శంకర సాంబశివ…
హే పార్వతి హృదయా పరమ శివా..!!రాముడు!!
శంభో శంకర అన్న నినాదం…
మా ఉజ్వల భవితకు జీవనవేదం…
నమశ్శివాయ అను పావన మంత్రం…
పలికిన మిగలవు కర్మలు ఏ మాత్రం…
హర హర శంకర జగదీశా…
హే పావన సుందర పరమేశా…!!రా!!
నిరతము నీ పద సేవలు చేతు…
సతతము నీ శుభ గానము చేతు…
ఫలితము కోరక పూజలు చేతు…
పరమార్ధము నెరిగి ప్రార్థన చేతు…
హర హర శంకర జగదీశా…
ఈ దీనుని మొర విను పరమేశ..!!రా!!
పాహి పాహి పరమేశ మాం పాహి పాహి జగదీశ… రక్షా రక్షా పరమేశ… శివ రక్షా రక్ష సర్వేశ…